బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్’. చారిత్రాత్మక ఇతివృత్తంతో వచ్చిన ఈ సినిమాకు జనాలు నీరాజనం పలికారు. కాగా మరాఠా యోధుడు తానాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో రియల్ లైఫ్ జంట అజయ్‌దేవ్‌గన్, కాజోల్ రీల్ లైఫ్‌లోనూ భార్యాభర్తలుగా నటించారు. జనవరి 10న విడుదలైన ఈ చిత్రం థియేటర్ల వద్ద ఏమాత్రం తడబడకుండా ఇప్పటికీ కలెక్షన్లు రాబడుతోంది. సినిమా రిలీజైన పదిరోజులకే దుకాణం బంద్ చేసుకుంటున్న ఈ రోజుల్లో తాన్హాజీ మూడో వారంలోనూ రూ.32.75 కోట్లు సాధించింది.
ఆ రికార్డుకు అడుగుదూరంలో తాన్హాజీ